: బీజేపీని మోడీ హైజాక్ చేశాడు: పృథ్విరాజ్ చవాన్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ విరుచుకుపడ్డారు. మోడీ అత్యంత ప్రమాదకారి అని అన్నారు. ఆయన బీజేపీని హైజాక్ చేశారని చెప్పారు. బీజేపీ అగ్రనేతలను సైతం పక్కనబెట్టి పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీలో మోడీ వన్ మ్యాన్ షోగా మారిపోయారని తెలిపారు. నిరంకుశ ధోరణులు ఉన్న మోడీ... భారత రాజకీయాలను తాను మాత్రమే శాసించే దిశగా కొనసాగుతున్నాడని... దేశ భవిష్యత్తుకు ఇది మంచిది కాదని అన్నారు. ఇలాంటి వ్యక్తితో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News