: వైకాపా మేనిఫెస్టో విడుదల
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను వైఎస్సార్సీపీ విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత జగన్ మేనిఫెస్టో వివరాలను ప్రకటించారు. సీమాంధ్ర, తెలంగాణలకు వేర్వేరుగా మేనిఫెస్టోలను రూపొందించారు. అభివృద్ధి, సంక్షేమమే తమ నినాదం అని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలనే మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు.
వైఎస్ పాలనాకాలం ఓ స్వర్ణ యుగమని... చంద్రబాబు పాలనకు, వైఎస్ పాలనకు ఎంతో తేడా ఉందని జగన్ అన్నారు. తాము మళ్లీ సువర్ణ పాలన తెస్తామని, అధికారంలోకి వస్తే తాము మళ్లీ వైఎస్ నాటి పాలన తీసుకొస్తామని చెప్పారు. మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు.