: కేశినేని నానికి టీడీపీ ఝలక్!
కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నానికి టీడీపీ షాక్ ఇచ్చింది. నాని ఇంతకాలం టీడీపీ తరపున విజయవాడ లోక్ సభ టికెట్ ను ఆశించారు. అయితే, తాజాగా విజయవాడ లోక్ సభ టికెట్ ఇవ్వడం వీలు పడడం లేదని, విజయవాడ తూర్పు లేదా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆయనకు టీడీపీ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో కంగారుపడ్డారు. తాను అసెంబ్లీకి పోటీ చేయనని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై అధ్యక్షుడు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని నాని మీడియాతో చెప్పారు.