: ఎంపీ చింతా చిత్రమైన జోస్యం
తిరుపతి ఎంపీ చింతా మోహన్ భవిష్యత్తుపై చిత్రమైన జోస్యం చెప్పారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదట. అయినా, కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ 2016లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని నెల్లూరులో మీడియాకు చెప్పారు. సీమాంధ్రలోనూ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు70, టీడీపీకి 70 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ కు 25 స్థానాలు వస్తాయని ఆయన తెలిపారు.