: నిర్ణయం మార్చుకున్న డీఎల్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ మారే విషయంలో వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని కార్యకర్తలకు తెలియపరిచారు. ప్రస్తుతం డీఎల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానంలో ఆయన భార్యను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. డీఎల్ టీడీపీలోకి వెళతారంటూ ఈమధ్య బాగా ప్రచారం జరిగిన సంగతి విదితమే.