: జగ్గారెడ్డిపై 'కోడ్' ఉల్లంఘన కేసు నమోదు


మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)పై నిన్న ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. సికింద్రాబాద్ లోని గన్ రాక్ ఫంక్షన్ హాల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు మిక్సీలు, మైక్రోఓవెన్లు, సెల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందం అధికారులకు సమాచారం అందడంతో ఫంక్షన్ హాల్ పై వారు దాడి చేశారు. పోలీసులను గమనించగానే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు పరుగులు పెట్టారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఫంక్షన్ హాల్ గోడ దూకి పారిపోయారు. ఈ సందర్భంగా ఒక మహిళ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడ ఉన్న వివిధ రకాల వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News