: విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు


శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెస్ విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్, 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు రెండు వారాల్లోగా ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

నోటీసులు అందుకున్న వారిలో
 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నాని ఉన్నారు. పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలకు పూనుకున్న సీఎల్పీ, టీడీఎల్పీలు చేసిన ఫిర్యాదు మేరకు సభాపతి ఈరోజు నోటీసులు పంపారు.

  • Loading...

More Telugu News