: ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి: సీఈసీ సంపత్
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలని ప్రధాన ఎన్నికల అధికారి సంపత్ కోరారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన ఎన్నికల వ్యయంపై వివరణనిచ్చారు. బహిరంగసభలో అభ్యర్థి పాల్గొంటే ఆ ఖర్చంతా ఆ అభ్యర్థి ఖాతాలోకి వెళుతుందని ఆయన చెప్పారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు కోడ్ అడ్డంకిగా ఉండదని ఆయన వివరించారు.