: పట్టు పాన్పులపై మడోన్నా.. పుట్ పాత్ పై బ్రదరన్న!


ప్రపంచ పాప్ సంగీత రారాణి మడోన్నా ఇటీవలే ఐదు వేల కోట్ల ఆదాయంతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళా పాప్ స్టార్లలో బిలియనీర్ హోదా దక్కించుకున్న తొలి గాయని మడోన్నానే. ఖరీదైన భవంతులు, విలాసవంతమైన కార్లు, ఎక్కడికెళ్ళినా వెంట వచ్చే పరివారం, రెడ్ కార్పెట్ పరిచే అభిమాన జనం ఆమె సొంతం.

ఇదిలావుంటే, మడోన్నా సోదరుడు ఆంటోనీ సిక్కోన్ మాత్రం దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నాడట. మద్యానికి బానిసైన ఆంటోనీ మిచిగాన్ నగరంలో పుట్ పాత్ లపై జీవనం సాగిస్తున్నాడు. తాను చచ్చినా బతికినా, తన సోదరి పట్టించుకున్న పాపానపోవడంలేదని ఆంటోనీ వాపోతున్నాడు.  తనదైన ప్రపంచంలో బతుకుతున్న మడోన్నా తోబుట్టువులను ప్రేమగా చూడదని ఆంటోనీ ఆరోపించాడు.

రోజులో అత్యధిక భాగం మద్యం మత్తులో మునిగితేలే ఆంటోనీ ఇటీవలే జైలుకెళ్ళొచ్చాడు. తాగి చిన్నారులను దూషించిన కేసులో ఓ నెల కటకటాల వెనక గడిపాడు. కాగా, ఆంటోనీని పలుమార్లు మడోన్నాయే పునరావాస కేంద్రాల్లో చేర్పించి, ఆ ఖర్చులన్నీ భరించిందని మడోన్నా కుటుంబ సన్నిహితులొకరు వెల్లడించారు. తాగుడు మానితేనే మళ్ళీ అక్కున చేర్చుకుంటామని మడోన్నా కుటుంబం ఆంటోనీకి ఎప్పుడో తేల్చిచెప్పిందట.  

  • Loading...

More Telugu News