: వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు మావే: రాజ్ నాథ్ సింగ్


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అత్యధిక సీట్లలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. జార్ఖండ్ లోని మజ్ గావ్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో మోడీ పవనాలు బలంగా వీస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించామని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఛత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ అక్కడి వనరులను ఉపయోగించుకొని ఎలా అభివృద్ధిని సాధిస్తున్నారో జార్ఖండ్ లోనూ అదే అభివృద్ధిని చూస్తారని భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News