: గెలిచి పొన్నాలకు బుద్ధి చెబుతా: మాధవ్ రెడ్డి


ఎన్నికల్లో గెలిచి తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు బుద్ధి చెబుతానని నర్సంపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాధవ్ రెడ్డి సవాలు విసిరారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, పొన్నాల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. అధిష్ఠానం తనకు కేటాయించిన సీటును పొన్నాల అమ్ముకున్నారని ఆయన విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చూపిస్తానని ఆయన హెచ్చరించారు. అందుకే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News