: కోట్లు కుమ్మరిస్తే లగడపాటికి కూడా కేసీఆర్ టికెట్లు ఇస్తారు: మాజీ మంత్రి సారయ్య


వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లు కుమ్మరిస్తే లగడపాటి రాజగోపాల్ కు కూడా కేసీఆర్ టికెట్ ఇస్తారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో తనపై పోటీగా బరిలోకి దిగిన కొండా సురేఖపై కూడా ఆయన మండిపడ్డారు. తాను భూకబ్జాలు చేసినట్టు కొండా దంపతులు ఆరోపిస్తున్నారని... వాటిని నిరూపిస్తే ఆ భూములన్నింటినీ పేదలకు పంచుతానని సవాల్ విసిరారు. తెలంగాణ వాదంతోనే తాను గెలుపొందుతానని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News