: కాంగ్రెస్ గూటికి చేరే యోచనలో గంటా వర్గ ఎమ్మెల్యేలు


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన వర్గ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చే పరిస్థితి తలెత్తింది. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యలు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము గంటానే నమ్ముకున్నామని, టీడీపీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నట్టు వెంకట్రామయ్య తెలిపారు. తమకు కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిన విషయం నిజమేనని కన్నబాబు తెలిపారు. తమ వర్గానికి టికెట్లను టీడీపీ కేటాయించలేదని వీరు మధనపడుతున్నారు.

  • Loading...

More Telugu News