: మోడీని కలవనున్న రజనీకాంత్
బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి పవన్ కల్యాణ్, నాగార్జునలు మోడీకి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సమయం ఆసన్నమైంది. రేపు (ఆదివారం) మోడీతో రజనీ భేటీ అవుతున్నారు. ప్రముఖ పత్రికా సంపాదకుడు చో రామస్వామి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ భేటీ వెనకున్న కారణాలు ఇంకా తెలియరాలేదు.