: మోడీ వివాహ విషయం ఆయన వ్యక్తిగతం: వెంకయ్య


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వివాహ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మరోసారి మండిపడ్డారు. మోడీ ప్రభంజనంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ నేతలు అసలు విషయాలు వదిలి చౌకబారు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని విమర్శించారు. జాతీయ స్థాయి నేతలు కూడా వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమని మీడియా సమావేశంలో అన్నారు. వివాహ విషయం ఆయన వ్యక్తిగతమన్నారు. భారతీయులు సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారన్నారు.

ప్రధాని సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ద్వారా మన్మోహన్ సింగ్ బలహీనమైన ప్రధాని అని తేలిందన్నారు. దాంతో, అపఖ్యాతి మూటగట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అందులో కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం కూడా బయటపడిందన్నారు. కాంగ్రెస్ లో వారసత్వం, కుటుంబ పాలన నడుస్తోందని, బాధ్యత లేకుండా సోనియా అధికారం అనుభవించారని వెంకయ్య ఆరోపించారు. దృఢమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News