: టీడీపీలో చేరాలనుకుంటున్నా: గుంతకల్ ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా గుంతకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు.