: ఎల్లుండి నుంచే రిజిస్ట్రేషన్ల బాదుడు షురూ
స్థల, గృహ తదితర స్థిరచరాస్తుల రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎల్లుండి నుంచి ( ఏప్రిల్ 1) అమలులోకి వస్తున్నాయి. రెండురోజుల్లో భారీగా పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయని తెలియడంతో రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. స్థల, గృహ క్రయవిక్రయాలను త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనేకమంది బారులు తీరారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరల పెంపుతో ప్రజలపై రూ.1600 కోట్ల అదనపు భారం పడనుంది.
మరోవైపు పట్టణ, గ్రామీణ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని భూముల విలువను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఈరోజు 157 జీవో జారీ చేసింది.
తాజాగా మరో జీవో జారీ : భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతూ జీవో విడుదల చేసిన కొంతసేపటికే, పట్టణ, గ్రామ ప్రాంతాల వాసులకు ఊరట కల్పిస్తూ సర్కారు మరో జీవోను జారీ చేసింది. తాజా జీవో ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 శాతానికి తగ్గనున్నాయి.