: అమేధీలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్
అమేధీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి బారీ ర్యాలీగా వెళ్లిన రాహుల్ గాంధీకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పూలవాన కురిపించారు. దీంతో ఆయన వెళ్లిన రహదారి మొత్తం పూలతో నిండిపోయింది. రాహుల్ గెలుపు కూడా పూలవానేనని ఇక్కడి కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు.