: ములుగులో ముక్కోణపు పోటీ


వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది. గోదావరి తీరంతో పాటు దేవాదుల, కంతనపల్లి వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులతో అలరారుతున్న ములుగు వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పొదెం వీరయ్య (కాంగ్రెస్), ధనసరి అనసూయ (సీతక్క) (టీడీపీ), అజ్మీరా చందూలాల్ (టీఆర్ఎస్) మధ్య పోటీ కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది మేమేనంటూ కాంగ్రెస్... తమ నిర్విరామ పోరాటం వల్లే సాధ్యమైందంటూ టీఆర్ఎస్... అసలు మేం లేఖ ఇవ్వకుంటే వచ్చేదా? అంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఎవరికి వారే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ములుగు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,92,765 మంది ఉన్నారు. వారిలో 86,039 మంది పురుషులు కాగా, 96,709 మంది మహిళలు ఉన్నారు. ఇక, ఈసారి కొత్తగా 17,697 మంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.

  • Loading...

More Telugu News