: బయట మూత్ర విసర్జన చేయకుండా నిరోధించలేం: ఢిల్లీ హైకోర్టు


బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా నిరోధించాలంటూ దాఖలైన ఒక పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ప్రతీ పురుషుడు బయట మూత్ర విసర్జన చేయకుండా నిరోధించాలంటే వారి జిప్పులకు తాళం వేసి, కీలు ఇంట్లో పెట్టి రావాల్సి ఉంటుంది. కానీ ఇలా చేయడం వీలు పడదు' అంటూ జస్టిస్ ప్రదీప్, జస్టిస్ దీపాశర్మతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన సమస్య అన్ని చోట్లా ఉందని, దాన్ని పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. ఇంటి నుంచి వచ్చేటప్పడు జిప్ కు తాళం వేసుకుని రావాలని కోర్టు ఆదేశించలేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలలో గోడలపై దేవుడి ఫొటోలు ఉన్నా సరే మనుషులను మూత్ర విసర్జన చేయకుండా నిరోధించలేరంటూ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో కొన్ని కాంప్లెక్స్ లు గోడలపై మూత్ర విసర్జన చేయకుండా దేవుళ్ల బొమ్మలను ఏర్పాటు చేశాయని వాటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరగా కోర్టు తిరస్కరించింది.

  • Loading...

More Telugu News