: కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి


విశాఖ జిల్లాలోని రసాయన కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పాయకరావుపేట మండలం కేశవరంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరో 13 మంది కార్మికులు క్షతగాత్రులయ్యారు. వారిని చికిత్స నిమిత్తం కాకినాడ, తుని ఆసుపత్రులకు తరలించారు.

  • Loading...

More Telugu News