: చేయి మారితే స్మార్ట్ ఫోన్ కు లాకు పడుద్ది
పొరపాటున విలువైన స్మార్ట్ ఫోన్ కాస్తా చోరరాయుడి చేతిలో పడిందనుకోండి. అందులో ఉన్న విలువైన డేటా, ఇతర సమాచారం వారికి తెలిసిపోతుందనే భయం ఇక అక్కర్లేదు. మీ స్మార్ట్ ఫోన్ ను వేరొకరు తీసుకుని ఆపరేట్ చేస్తుంటే, వారి చేతి కదలికల ఆధారంగా మీరు కాదని గెశ్చర్ సాఫ్ట్ వేర్ కనిపెట్టేస్తుంది. వెంటనే ఫోన్ కు లాకేస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ముందుగా అసలు యూజర్ చేతివేళ్ల గుర్తులు, వారి కదలికలను స్టోర్ చేసుకుటుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడైనా యూజర్ల కదలికల్లో మార్పులు వస్తే లాక్ వేయడం ద్వారా ఫోన్ ను కాపాడుతుందనమాట. ఈ సాఫ్ట్ వేర్ ను అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు. వీరిలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు.