: లక్నోలో 28 నామినేషన్లు తిరస్కరణ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లక్నో లోక్ సభ స్థానానికి కుప్పలు తెప్పలుగా నామినేషన్ లు వచ్చాయి. దాంతో, అన్నింటినీ పరిశీలించిన ఎన్నికల అధికారులు ఇరవై ఎనిమిది దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. కొన్ని గంటల పాటు నామినేషన్లు అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి సరైన అభ్యర్థుల నామినేషన్లకు ఓకే చేసినట్లు చెప్పారు. దాంతో, ఏఏపీ నుంచి జావెద్ జాఫ్రీ, బీజేపీ నుంచి రాజ్ నాథ్ సింగ్, ఎస్పీ నుంచి అభిషేక్ మిశ్రా, బీఎస్పీ నుంచి నకుల్ దుబే, కాంగ్రెస్ నుంచి రీటా బహుగుణ పోటీ పడనున్నారు. అంతేకాక జాతీయ పార్టీల నుంచి పదిమంది స్వతంత్ర అభ్యర్థులు, మరో పద్నాలుగు మంది క్యాండిడేట్లు కూడా బరిలో ఉన్నారు. ఈ నెల 30న లక్నోలో పోలింగ్ జరగనుంది.