: అజంఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ నేత అజంఖాన్ పై ఆ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కార్గిల్ యుద్ధంలో ముస్లిం జవానుల వల్లే విజయం సాధ్యమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలుగా పేర్కొంటూ ఆయనను ఎన్నికల నుంచి బహిష్కరించింది. తక్షణం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.