: బాబుతో బాలయ్య భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ భేటీ అయ్యారు. బాలయ్య రాజకీయ రంగ ప్రవేశంపై వీరు చర్చించేందుకు సమావేశమైనట్టు సమాచారం. కాగా గతంలో బాలయ్య టీడీపీ తరపున ప్రచారం చేసినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. దీంతో ఆయన రాజకీయ రంగప్రవేశం టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి జరిగితే బాగుంటుందని పార్టీ శ్రేణులు ఆశపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. అధినేత ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించిన బాలయ్య హిందూపురం నుంచి పోటీకి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.