: ఎంపీ వివేక్ పై ధ్వజమెత్తిన ప్రత్యర్థి
పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వివేక్ పై టీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ విరుచుకుపడ్డారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, వంద కోట్లతో తమరు ఎన్నికల బరిలో నిలుచుంటే, వంద కేసులతో తాను తలపడుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ది కౌరవ సేన అని, తమది పాండవ సైన్యమని అన్నారు. సెంటు వాసనతో వివేక్ ప్రజల్లోకి వస్తుంటే, చెమట వాసనతో తాము ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. ధనబలం వివేక్ కి ఉంటే, జనబలం తమకు ఉందని బాల్క సుమన్ తెలిపారు. టీఆర్ఎస్ ను వీడి మరోసారి కాంగ్రెస్ లో చేరిన వివేక్ కి విశ్వసనీయత లేదని ఆయన మండిపడ్డారు.