: బీజేపీ తరపున ప్రచారం చేయనున్న పవన్ కల్యాణ్


గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. కర్ణాటకలోని గురుమట్కల్, కోలార్, బళ్లారి ప్రాంతాల్లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికి పవన్ సిద్ధమయ్యారు. దీనికితోడు, రాష్ట్రంలో కూడా బీజేపీ తరపున ప్రచారం చేయాలంటూ వవన్ ను కోరామని... దానికి ఆయన అంగీకరించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగే మోడీ సభలకు కూడా హాజరు కావాలంటూ పవన్ ను బీజేపీ నేతలు కోరారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన కార్యాలయంలో అభిమాన సంఘాల నేతలతో హాజరయ్యారు. పార్టీ విస్తరణపై సలహాలు స్వీకరిస్తున్నారు. దీనికితోడు, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News