: టీఆర్ఎస్ కు శ్రవణ్ షాక్
కేసీఆర్ తనకు షాకివ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ ఆ పార్టీ అధినేతకు షాకివ్వనున్నారు. టికెట్ పై కొండంత ఆశతో ఉన్న శ్రవణ్ కు కేసీఆర్ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో ఆయన కేంద్ర మంత్రి జైరాం రమేష్ సమక్షంలో తన మద్దతుదారులతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ టీఆర్ఎస్ నేత కాజం సత్యనారాయణ కూడా ఆయనతో పాటు చేరనున్నారు.