: నడిచే బంగారు గని బప్పీలహరి ఆస్తులు ఇవి
నడిచే నిలువెత్తు బంగారు గని బప్పీలహరి ఎన్నికల సంఘానికి అఫిడవిట్ దాఖలు చేశారు. బప్పీలహరి నడుస్తుంటే జిగేల్ మనే చెయిన్లు, ధగధగమనే నగలు, బంగారు వాచీ, బ్రాస్ లెట్టు, పదివేళ్లకు ఉంగరాలు నడిచి వస్తున్నట్టుంటాయి. అంతెత్తున బంగారం వేసుకొచ్చే ఈ బప్పీలహరి దగ్గర ఎంత బంగారం ఉంది అనేది అభిమానుల ప్రశ్న. దీనికి ఆయన ఎన్నికల అఫిడవిట్లో సమాధానమిచ్చారు.
ఆయన దగ్గర 754 (75.40 తులాలు) గ్రాముల బంగారం, ఆయన భార్య దగ్గర 967 (96.70 తులాలు) గ్రాముల బంగారం ఉందని దాని విలువ సుమారు 38 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా వారిద్దరి దగ్గర 13.5 కేజీల వెండి కూడా ఉందని పేర్కొన్నారు. స్థిర చరాస్తులు దాదాపు 12 లక్షల రూపాయలు ఉన్నాయని తెలిపారు. అలాగే తన దగ్గర బీఎండబ్ల్యూ, ఆడి కారు సహా అయిదు కార్లు ఉన్నాయని బప్పీదా తెలిపారు.