: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో రోజురోజుకీ బలహీనపడిపోతోంది. ఆ పార్టీ నుంచి నేతల వలసలు ఆగడం లేదు. తాజాగా మాజీ మంత్రి పార్థసారధి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన నివాసం వద్ద ఇద్దరు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.