: 'గంగ్నమ్ సై' తో డాన్స్ వేయాలనుందంటున్న షారుక్
వచ్చే ఏడాదికిగానూ దక్షిణ కొరియా గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నియమితుడయ్యాడు. ఈ సందర్భంగా గుర్గావ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ ను కొరియా అధికారులు సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఇంతటి గౌరవాన్ని పొందినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. రెండు దేశాల (భారత్, కొరియా) మధ్య మంచి ప్రచారాన్ని చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఖాన్ తెలిపాడు. తనను అంబాసిడర్ గా ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అయితే, కొరియా పాప్ సంచలనం 'గంగ్నమ్ స్టైల్' పాటకు 'సై'తో కలసి డాన్స్ వేయడం తనకు చాలా ఇష్టమని బాద్షా వెల్లడించాడు.