: జైరాంతో జానా భేటీ
కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో మాజీ మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. అల్పాహార విందు పేరిట జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించే విషయంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రచారం ఊహించినంత వేగంగా లేదన్న భావనలో ఉన్న జైరాం రమేష్ ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని ఆదేశించారు.