: ఏటా 10లక్షల మందికి కేన్సర్... 7లక్షల మంది మృతి


కేన్సర్ మహమ్మారి ఏటా భారత్ లో ఏడు లక్షల మందిని బలి తీసుకుంటోంది. అలాగే, ఏటా మన దేశంలో 10 లక్షల మంది కొత్తగా కేన్సర్ బారిన పడుతున్నారట. లాన్సెట్ ఆంకాలజీ అనే పత్రికలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. 2035 నాటికి ఏటా కేన్సర్ తో మరణించే వారి సంఖ్య 12 లక్షలకు, కేన్సర్ బారినపడే వారి సంఖ్య 17లక్షలకు చేరవచ్చని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో మరిన్ని కేన్సర్ ఆస్పత్రులు, కేన్సర్ వైద్య నిపుణులు అవసరమని ఆ కథనం సూచించింది. అలాగే కేన్సర్ ను నివారించేందుకు భారతీయులకు అనువైన, అందుబాటులో ఉండే చికిత్సా విధానాలు అవసరం ఉందని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో భారత్ లో నేతలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని వివిధ దేశాలకు చెందిన 40 మంది నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News