: బెంగళూరు చేరుకున్న నటుడు అంబరీష్
శాండల్ వుడ్ నటుడు, కర్ణాటక మంత్రి అంబరీష్ పూర్తిగా కోలుకున్నారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ కు సింగపూర్ లో చికిత్స తీసుకున్న అనంతరం శుక్రవారం ఆయన బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో అభిమానులు, పలువురు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో భార్య సుమలతతో కలసి మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదం, ప్రార్థనల కారణంగానే మళ్లీ ఆరోగ్యవంతుడిగా ప్రజా జీవితంలోకి తిరిగి రాగలిగినట్లు పేర్కొన్నారు. తనకోసం ప్రార్థించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తాను సింగపూర్ లో ఉండగా సొంత ఖర్చులతో ఎంతోమంది చూసేందుకు వచ్చారని వారిని తానెప్పటికీ మరచిపోలేనని చెప్పారు.