: ప్రచారం ప్రారంభించిన కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాచిగూడలోని వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ఆరంభించారు. తన నియోజకవర్గం అంబర్ పేటలో గడప గడపకూ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. తెలంగాణలో టీడీపీ, బీజేపీ కూటమికి పట్టం కట్టాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ చేసిన కృషి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వి.హనుమంతరావు లాంటి సీనియర్లు బరిలో ఉన్నప్పటికీ తన విజయం ఖాయమని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రాభవం రోజురోజుకూ తగ్గిపోతోందని... ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీల కూటమి అగ్రస్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.