: రెచ్చగొట్టారు... నిషేధానికి గురయ్యారు


ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా రెచ్చగొట్టే, హానికారక వ్యాఖ్యలు చేశారు. వారిలో ఒకరు బీజేపీ ఉత్తప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జ్ అమిత్ షా. మరొకరు ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్. వీరిద్దరూ తీవ్ర హానికారక ప్రసంగాలు చేసినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ధారించింది. వీరు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సభలు, సమావేశాలు, ఊరేగింపులు, రోడ్ షోలలో పాల్గొనకుండా నిషేధం విధించింది. అమిత్ షా ఇటీవల ఉత్తరప్రదేశ్ లో గతేడాది మతఘర్షణలు జరిగిన ప్రాంతాలలో పర్యటించారు. నాటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. అజంఖాన్ అయితే ఒక అడుగు ముందుకేసి కార్గిల్ యుద్ధవిజయం కేవలం ముస్లిం సైనికుల వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి అజంఖాన్ వ్యాఖ్యలు దేశ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీసేవే. ప్రతీ సైనికుడూ తన వంతు పాత్ర పోషిస్తుంటేనే దేశ రక్షణ సాధ్యం. వారిలో మతభేదాలు ఉండవు. వారంతా భరతమాత కోసం శ్రమిస్తుంటారు. అలాంటిది ఒక పెద్ద యుద్ధ విజయాన్ని ఆయన ఒక మత వర్గం వారి ఘనతగా చెప్పి మిగతా సైనికులందరినీ కించపరిచారు. ఈ ఇద్దరు నేతల ప్రసంగాలను పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం వీరిపై నిషేధం వేటు వేసింది. వీరు తీవ్ర నేరాలకు పాల్పడ్డారని పేర్కొంది.

  • Loading...

More Telugu News