: నేడు సీమాంధ్రలో ఎన్నికల నోటిఫికేషన్
సీమాంధ్రలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అనంతరం ఈ రోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 23న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కాగా ఈ నెల 13, 14, 18వ తేదీలు సెలవు దినాలు కావడంతో మిగతా 5 రోజులు నామినేషన్లను స్వీకరిస్తారు. పోలింగ్ మే 7న జరగనుంది.