: ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి నియమితులయ్యారు. రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఆమె కొనసాగుతున్నారు. దీంతో ఈ హోదాలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ రోహిణి చరిత్ర కెక్కారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం రాత్రి ఆమోదముద్ర వేశారు. ఈ నియామకంతో రాష్ట్రానికి చెందిన మహిళకు దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కింది. త్వరలో సీజేగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1955 ఏప్రిల్ 14న గొర్ల సావిత్రి, సూర్యారావు దంపతులకు విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ రోహిణి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.