: రేపు సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల
సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధుల తొలిజాబితా రేపు రాత్రి విడుదల అయ్యే అవకాశం ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అభ్యర్ధుల కసరత్తులో భాగంగా ఢిల్లీ వచ్చిన ఆయన విలేకరులకు ఈ విషయం తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి 150 మంది అభ్యర్ధులను ఎంపిక చేసి రేపు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతున్నట్టు చెప్పారు. రేపు రాత్రికి జాబితాకు సీఈసీ ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన వివరించారు.