: పేస్ బుక్ చూసే యువతుల్లో ప్రతికూల భావాలు!


ఫేస్ బుక్... ఈ పేరు తెలియని యువత లేదంటే అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్న ఈ ఫేస్ బుక్ ను ఇప్పుడు టీనేజ్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ వాడుతున్నారు. ఈ తరహా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లతో సామాజిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నా, దాంతో కొంత చేటు కూడా ఉందని తాజాగా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఫేస్ బుక్ మరియు ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మహిళలు ఎక్కువగా విహరిస్తే వారి శరీరంలో పలు మార్పులు జరిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. దీనిపై యూకే కు చెందిన స్ట్రాథ్ క్లైడ్ వర్శిటీ పరిశోధకులు, అమెరికాకు చెందిన ఓహియో వర్శిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధన నిర్వహించారు.

మహిళలు ఎక్కువగా ఫేస్ బుక్ లో అదే పనిగా ఇతరుల ఫోటోలను చూస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటే... అవతలి వారి ప్రభావం వీరిపై ఎక్కువగా పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వీరు స్నేహితులతో ఆన్ లైన్ లో ఎక్కువ సమయం గడిపితే శరీరంలో మార్పులు చోటు చేసుకున్నట్లు అనుభూతి పొందుతుంటారని తెలిపారు. దీనికి గాను 881 మంది కాలేజీ యువతులపై పరిశోధనలు చేశారు. ఆ అమ్మాయిలు ఫేస్ బుక్ ను ఉపయోగించే క్రమంలో స్నేహితుల శరీరంతో పోల్చుకుంటూ ఎక్కువగా కలత చెందుతున్నట్లు గ్రహించారు. అనంతరం ఆ యువతులను పరీక్షించగా వారు మునుపటి శరీరాకృతిని కోల్పోయినట్లు ఈ పరిశోధనల్లో తేలింది.

  • Loading...

More Telugu News