: లోకల్ వారికి స్థానం లేదు...అయినా సన్ రైజర్స్ లోకలేనంట


ఈ నెల 16 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సందర్బంగా సన్ రైజర్స్ జట్టు హైదరాబాదులో సందడి చేసింది. యాజమాన్యం మారడంతో సన్ రైజర్స్ జట్టుగా రూపాంతరం చెందిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులో వేణుగోపాలరావు మినహా స్థానిక ఆటగాడు లేకపోవడం విశేషం. వేణుగోపాలరావు కూడా దేశవాళీ క్రికెట్ లో ఇతర రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో అతను కూడా స్థానికేతరుడే.

ఇంతకీ ఈ జట్టులో స్థానికుడెవరైనా ఉన్నారంటే ఆయన బ్యాటింగ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రమే. దీంతో స్థానికులు లేని స్థానిక జట్టు సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ పేరిట బరిలో దిగి ఐపీఎల్ 7 ట్రోఫీని గెలుచుకుంటామని తెలిపింది. విహారిని వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నించామని అయినప్పటికీ కుదరలేదని లక్ష్మణ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News