: నేనెవరినీ మోసం చేయలేదు: విజయరాణి


చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసిన టీవీ నటి విజయరాణిని హైదరాబాదులో ఈరోజు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఎవరినీ మోసం చేయలేదు’ అని చెప్పింది. ఆర్టిస్టుగా ఉంటూ చిన్న చిన్న చిట్టీలు ప్రారంభించానని, తనకు కోటి రూపాయలకు పైగా రావాల్సి ఉందని, ప్రజలు ఎగవేశారని విజయరాణి తెలిపింది. తాను కట్టవలసిన వాటిపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసరికి పరువు పోతుందని అధిక వడ్డీకి అప్పు చేసి వారికి కట్టి, అప్పుల పాలయ్యానని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన వద్ద డబ్బు ఏమీ లేదని, తినటానికి తిండి కూడా లేకపోతే పోలీసులే తనకు భోజనం పెట్టించారని చెబుతూ విజయరాణి కన్నీరు పెట్టింది.

చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి, కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన టీవీ నటి విజయరాణిని రెండు రోజుల క్రితమే బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఆర్టిస్టులకు ఆమె రూ. 4 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని తెలియవచ్చింది.

  • Loading...

More Telugu News