: మోడీది బాల్యవివాహం: వెంకయ్య నాయుడు
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కాకుండా, వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టినట్లు కనబడుతోందని అన్నారు. మోడీ బాల్య వివాహం చేసుకున్నారని వెంకయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ల పాలనపై చర్చించకుండా... వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతోందని వెంకయ్య విమర్శించారు. ఈ తరహా విధానమే కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు.
టీడీపీతో తమ పార్టీ పెట్టుకున్న పొత్తుతో మంచి ఫలితాలు వస్తాయని వెంకయ్య తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి 50 సీట్లు వస్తాయని వెంకయ్య జోస్యం చెప్పారు.