: కరీంనగర్ లో 13న కేసీఆర్ బహిరంగ సభ
కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఆదివారం నాడు స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే ప్రచారంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా వినోద్ కుమార్, అసెంబ్లీ స్థానం నుంచి గంగుల కమలాకర్ పోటీలో ఉన్నారు.