: తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తాం: జైరాం రమేష్
తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు... దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టులు రెండు నిర్మిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ వరాలజల్లు కురిపించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు నుంచి వచ్చే ఆదాయంలో తెలంగాణ అభివృద్ధికి 25 నుంచి 30 కోట్ల రూపాయలను కేటాయిస్తామని అన్నారు. సింగరేణి బొగ్గు తెలంగాణదేనని, ఆ గనుల నుంచి వచ్చే ఆదాయంలో 51 శాతం తెలంగాణకు, 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.