: లాభపడ్డారు... కష్టకాలంలో వెళ్లిపోయారు: జేడీ శీలం
పార్టీని వీడిన సీనియర్ నేతలపై కాంగ్రెస్ నేత జేడీ శీలం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభపడిన సీనియర్లు... కష్టకాలంలో వేరే దారి చూసుకున్నారని విమర్శించారు. పార్టీ అండతో ఎంతో ఎత్తుకు ఎదిగిన వీరు.... పార్టీని వీడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోరాట స్పూర్తి, సేవా లక్షణం ఉన్న యువతకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అవకాశమివ్వాలని కోరారు.