: 900 ఏళ్ల నాటి నటరాజ విగ్రహం భారత్, ఆస్ట్రేలియా మధ్య చిచ్చు రేపుతుందా?


900 ఏళ్ల నాటి నటరాజ విగ్రహం భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య చిచ్చు రేపుతుందా? అంటే అవుననే అంటున్నారు ఆ దేశ విదేశీ వ్యవహారాల నిపుణులు. బీజేపీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలను 900 ఏళ్ల నాటి నటరాజ విగ్రహం ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2008లో తమిళనాడులోని శ్రీపురంతన్ ఆలయంలోని నటరాజ విగ్రహం ఆస్ట్రేలియాకు స్మగ్లింగ్ అయింది. అది ఇప్పడు కాన్ బెర్రాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ఉంది.

దీనిని 2008లో పెరావెల్స్ అనే మాజీ దౌత్యాధికారి 50 లక్షల డాలర్లకు కొనుగోలు చేశారు. సుభాష్ కపూర్ అనే విగ్రహాల వ్యాపారి ఈ విగ్రహాన్ని దొంగిలించిన నేరానికి చెన్నైలో విచారణ ఎదుర్కొంటున్నారు. భారతీయ కోర్టులో విచారణ జరుగుతున్న ఈ విగ్రహాన్ని భారత్ అడిగే అవకాశం ఉందని, ఇవ్వని పక్షంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్ లో ఈ విగ్రహం రెండు దేశాల మధ్య సంబంధాల్ని దెబ్బతీస్తుందా? పటిష్ఠం చేస్తుందా? అనేది చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News