: గవర్నర్ కు యనమల లేఖ
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రరూపం దాల్చిందని... గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. సాగునీరు, తాగునీటిపై విద్యుత్ కోతల ప్రభావం పడుతోందని తెలిపారు.