: హస్తం గుర్తు కాంగ్రెస్ ది కాదట...!
ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గుర్తు 'హస్తం' ఆ పార్టీది కాదట. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అంటే 1952వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెడ్లు. దీంతోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కేవలం హైదరాబాదు సంస్థానం తప్ప దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు కంకికొడవలి గుర్తుపై పోటీ చేశాయి. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు పార్టీలపై నిషేధం ఉండడంతో ప్రోగ్రెసివ్ డెమెక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరిట హస్తం గుర్తుపై పోటీ చేశాయి.
1957 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలకు కంకికొడవలి గుర్తును కేటాయించడంతో హస్తం గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. 1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా నిట్టనిలువుగా చీలిపోవడంతో ఇందిరా గాంధీ పక్షానికి ఆవుదూడ గుర్తు కేటాయించారు. ఆ తర్వాత మళ్ళీ రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ పేరిట పార్టీ చీలింది. అప్పుడు ఇందిర హస్తం గుర్తును స్వీకరించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైనే పోటీ చేస్తోంది.