: టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. టీడీపీ నేత పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. తాళ్లూరులో కూడా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరుపక్షాలు రాళ్లదాడులకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.